టీ కప్పులతో గణేశుడి ఆకృతి
NEWS Sep 07,2024 01:03 pm
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు టీ కప్పులతో రూపొందించిన వినాయక రూపం పలువురిని ఆకర్షించింది. వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి సంవత్సరం విభిన్న రూపాల్లో వినాయక ఆకృతులు తయారు చేయడం ఆనవాయితీగా వస్తోందని హెచ్ఓడీ సూర్య తెలిపారు.