గరికపోచపై గణపతి ప్రతిమ
NEWS Sep 07,2024 05:29 am
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినూత్నరీతిలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందర్నీ అబ్బురపరిచేలా గరికపోచపై గణపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లంబోదరుడికి ఇష్టమైన గరికపోచపై ఆయన విగ్రహాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దయాకర్ తెలిపారు. ఈ కళాఖండం సృష్టించడానికి దాదాపు 10 గంటలు కష్టపడినట్లు తెలిపారు.