మట్టి గణపతులు పంపిణీ చేసిన కలెక్టర్
NEWS Sep 06,2024 05:53 am
KMR: మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ జిల్లా ప్రజలకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ లో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి పర్యావరణాహితమైన మట్టి గణపతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కంపెనీ చేశారు. గణేష్ నవరాత్రులలో వినాయకుని ప్రతిమాలను పూజించడం మన సంస్కృతంలో భాగమన్నారు.