Logo
Download our app
గంజాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
NEWS   Sep 05,2024 04:33 pm
నిర్మల్ పట్టణంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ గురువారం ఉదయం ముందస్తు సమాచారం మేరకు పట్టణ SI రమేష్ సిబ్బంది కలిసి మంచిర్యాల చౌరస్తా వద్ద చాచా టీ సెంటర్ వద్ద ఉండగా చౌస్ అబ్రార్, షేక్ రఫీ వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లు విడి గంజాయి తీసుకుని తమ కస్టమర్లకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source