Logo
Download our app
సిరిసిల్లలో పవర్‌లూం క్లస్టర్ కావాలి జౌళిశాఖ మంత్రిని కోరిన బండి సంజ‌య్
NEWS   Sep 04,2024 12:31 pm
సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కోరారు. దీంతో పాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడి సరుకు డిపో యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సబ్సిడీని 80% మేరకు పెంచాలని కోరారు. ఢిల్లీలో గిరిరాజ్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source