Logo
Download our app
చిరంజీవి భారీ విరాళం
NEWS   Sep 04,2024 06:20 am
భారీ వ‌ర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అత‌లాకుత‌ల‌మైన నేప‌థ్యంలో చిరంజీవి తెలుగు రాష్ట్రాల‌కు రూ. కోటి విరాళం ప్ర‌క‌టించారు. ఏపీ, తెలంగాణ‌కు చెరో రూ. 50ల‌క్ష‌ల చొప్పున ఇస్తున్నాన‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల‌తో రెండు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు క‌లుగుతున్న ఇబ్బందులు త‌న‌ను క‌లచివేస్తున్నాయని చిరు ట్వీట్ చేశారు. ప‌దుల సంఖ్య‌లో అమాయ‌కులు ప్రాణాలు కోల్పోవ‌డం విషాద‌క‌ర‌మ‌ని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.
⚠️ You are not allowed to copy content or view source