Logo
Download our app
తొలిసారి బ్రూనైకి ప్రధాని మోదీ
NEWS   Sep 03,2024 03:18 pm
ప్రధాని మోదీ ఆగ్నేయాసియా దేశం బ్రూనైలో ప‌ర్య‌టిస్తున్నారు. బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్‌లో మోదీకి ఘనస్వాగతం లభించింది. బ్రూనై యువరాజు, మంత్రి హాజీ అల్ ముహ్ తాదీ బిల్లా మోదీకి స్వాగతం పలికారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లారు. ఓ భారత ప్రధాని బ్రూనై దేశానికి ద్వైపాక్షిక పర్యటన కోసం వెళ్లడం ఇదే ప్రథమం. భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భం కూడా మోదీ పర్యటనకు విశిష్టతను చేకూర్చింది.
⚠️ You are not allowed to copy content or view source