Logo
Download our app
గుండె కరిగిపోయే దృశ్యాలు చూశా
NEWS   Sep 03,2024 07:20 am
ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి బాధితుల పరిస్థితిపై ట్వీట్ చేశారు. ఎటుచూసినా గుండె కరిగిపోయే దృశ్యాలే కనిపించాయని, బాధితుల కష్టాలు చూసి మనసు చెదిరిపోయిందని చెప్పారు. వరద నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని, వారి కష్టాలను స్వయంగా చూశానని చెప్పుకొచ్చారు. బాధితుల ముఖాలలో ఓవైపు తీరని ఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు. వారి కష్టం తీర్చడానికి, వారి కన్నీళ్లు తుడవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతటి సాయానికైనా వెనకాడదని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source