Logo
Download our app
రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
NEWS   Sep 02,2024 02:44 pm
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కవితకు బెయిల్ సందర్భంగా కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ఆరోపిస్తూ BRS MLA జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కవితకు బెయిల్ వచ్చిందా? ఇచ్చారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసింది. కమలంతో స్నేహం - కవితక్కకు మోక్షం అంటూ పేర్కొంది. కాంగ్రెస్ పోస్టులపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు 2 వారాల గడువును ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source