కొండచరియలు విరిగి పడి మృతి
NEWS Aug 31,2024 10:55 am
విజయవాడ - మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిలో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వీరిలో నలుగురు గాయపడగా.. ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరి కోసం రెస్క్యూ కొనసాగుతోంది.