Logo
Download our app
హిందూపురంలో బిజెపి సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం
NEWS   Aug 29,2024 04:45 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని రోటరీ క్లబ్లో బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ హాజరై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలమైన భారతదేశం కోసం బీజేపీని బలపరచాలని ప్రతి పోలింగ్ బూత్లో 300 మంది సాధారణ సభ్యులను నమోదు చేయాలని సూచించారు. కార్య క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source