గంజాయి స్వాధీనం - 9 మంది అరెస్టు
NEWS Aug 28,2024 05:54 pm
చింతూరు మండలం మోతుగూడెం చెక్ పోస్ట్ వద్ద 9 మందిని అరెస్టు చేసి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిస్సా నుంచి మహారాష్ట్ర తెలంగాణకు కారు, బైక్స్ పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ 13.50 లక్షలు దాదాపు ఉంటుందని అన్నారు