Logo
Download our app
సుప్రీం తీర్పును నిరసిస్తూ ధర్నా
NEWS   Aug 28,2024 05:57 pm
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మామిడికుదురులో బుధవారం ధర్నా చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వర్గీకరణపై ఐకమత్యంగా పోరాటం చేస్తామన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో పల్లంరాజు, మణిరాజు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సత్తిబాబు, పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source