Logo
Download our app
అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
NEWS   Aug 26,2024 09:54 am
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హైడ్రా కూల్చివేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని కామెంట్లు చేశారు. పేదలకు విద్యను అందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించామని.. వాటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source