Logo
Download our app
తిరిగి టీడీపీలోకి బాబుమోహన్ ?
NEWS   Aug 26,2024 08:12 am
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన బాబుమోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీలోకి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ లో సీఎం చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ అయ్యారు. టీడీపీలో చేరిక విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబుమోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుమోహన్ త్వరలోనే పచ్చ జెండా కప్పుకోనున్నారని వెల్లడించాయి.
⚠️ You are not allowed to copy content or view source