ముండ్లమూరులో పిచ్చి మొక్కల తొలగింపు
NEWS Jul 04,2025 06:06 pm
ముండ్లమూరులో రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమానికి బుధవారం పోలీసులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జెసిబి సహాయంతో తొలగించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నామని పోలీసులు చెప్పారు.