Logo
Download our app
ట్రిపుల్ ఐటికి ఎంపికైన విద్యార్థులను అభినందించిన డీఈఓ
NEWS   Jul 04,2025 06:09 pm
ఇటీవల విడుదలైన ట్రిపుల్ ఐటి ఫలితాలలో మందస మండల విద్యార్థులు మెరిసారు. మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎం. గిరిబాబు, సంజన బెహరా లు ట్రిపుల్ ఐటీకి ఎంపికై సత్తా చాటారు. విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మంగళవారం అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం. లక్ష్మణరావు, హెచ్ఎం ఎం. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source