పెరటి పంటలతో ఆదాయానికి మేలు
NEWS Jul 04,2025 06:10 pm
స్వయం శక్తి సంఘాలలో ప్రతి ఒక్కరూ పెరటిలో ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తూ, కిచెన్ గార్డెన్ పంటలు పండిస్తే, ఆరోగ్యంతో పాటు మార్కెట్లో వినియోగదారులుకు ధరల మంటలు అదుపులో ఉంటాయని వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. మంగళవారం మహిళలకు పెరటిలో కూరగాయలు పండించడానికి 11 రకాల విత్తనాలు రైతు ఉత్పత్తి దారుల సంస్థ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిని అందరూ చక్కగా వినియోగించుకొని ఆరోగ్యంతో పాటు అధిక ధరలను నియంత్రించగలగాలని కోరేరు.