ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ తీవ్రగాయాలు
NEWS Jul 04,2025 06:10 pm
వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీతంపేటకి చెందిన జీ. లక్ష్మణరావు, టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామానికి టీ. శివ అనే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా రెండు బైక్ పై వస్తున్న క్రమంలో ఒకరినొకరు ఢీకొట్టారు. ఇరువురుని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.