Logo
Download our app
గల్ఫ్ గగనతలంలో ఉద్రిక్తత.. ఎయిరిండియా కీలక నిర్ణయం
NEWS   Jun 24,2025 03:45 am
అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ ప్రాంతం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తదుపరి ప్రకటన వెలువడే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source