Logo
Download our app
26 నుండి శ్రీ పెరియాళ్వార్ ఉత్స‌వం
NEWS   Jun 23,2025 09:43 am
తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో జూన్‌ 26 నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్‌ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి తమ శిష్య బృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్ వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు. జూలై 5వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source