Logo
Download our app
భూమ‌న కామెంట్స్ టీటీడీ సీరియ‌స్
NEWS   Jun 23,2025 08:18 am
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టీటీడీ పై చేసిన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలేన‌ని పేర్కొంది టీటీడీ. ఆధారాలు లేకుండా విమ‌ర్శ‌లు చేయ‌డం మంచి పద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికింది. భ‌క్తుల‌కు నిరంత‌రం విశిష్ట సేవ‌లు అందిస్తున్న‌ సంస్థ మీద బురద జల్లడం శోచనీయమ‌ని పేర్కొంది. గ‌తంలో కంటే ప్ర‌స్తుతం వ‌స‌తి సౌక‌ర్యాల‌ను మెరుగు ప‌ర్చ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించింది.
⚠️ You are not allowed to copy content or view source