Logo
Download our app
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
NEWS   Jun 23,2025 07:58 am
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో జూరాల డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా మారింది. ఈ సీజన్ లో రెండోసారి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీశైలం డ్యామ్ నెమ్మదిగా నిండుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source