Logo
Download our app
కారు కింద ప‌డినా తొక్కుకుంటూ పోయారు
NEWS   Jun 22,2025 03:57 pm
ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. త‌న సోద‌రుడు జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. రెడ్డి వాహ‌నం కింద ప‌డి సింగ‌య్య న‌లిగి పోయిన దృశ్యాలు అత్యంత భయాన‌క‌రంగా ఉన్నాయ‌ని వాపోయారు. ఇంత జ‌రిగినా సోయి లేకుండా అలాగే కాన్వాయ్ పోనివ్వ‌డం త‌న‌ను కంట‌త‌డి పెట్టించేలా చేసింద‌న్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి అంటూ నిల‌దీశారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source