Logo
Download our app
ఇజ్రాయెల్‌పై విరుచుకుప‌డిన ఇరాన్
NEWS   Jun 22,2025 07:19 am
ఇరాన్, ఇజ్రాయెల్ మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. ఇరు దేశాలు నువ్వా నేనా అన్న రీతిలో దాడుల‌కు తెర లేపాయి. తాజాగా ఊహించ‌ని రీతిలో ఇరాన్ ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చింది. క్షిప‌ణుల‌తో విరుచుకు ప‌డింది. జెరూసలేం, టెల్ అవీవ్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో యుద్ధ‌ సైరెన్లు మోగాయి. ఇదిలా ఉండ‌గా ఇరాన్‌కు చెందిన 2 డ్రోన్ల‌ను కూల్చి వేసింది ఇజ్రాయెల్. మ‌రో వైపు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
⚠️ You are not allowed to copy content or view source