కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు ఇవ్వాలి
NEWS Jun 21,2025 07:21 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ పై అందరికంటే ముందు నేనే ఆరోపణలు చేశానని చెప్పారు. హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. పెద్దాయన చెబితేనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.