Logo
Download our app
యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్ గ్రేట్
NEWS   Jun 21,2025 11:09 am
విశాఖ కేంద్రంగా యోగాంధ్ర కార్య‌క్ర‌మం అద్బుతంగా జ‌రిగింద‌ని, గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు ద‌క్క‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. యావ‌త్ ప్ర‌పంచం త‌మ వైపు చూసేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చార‌ని అన్నారు. 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చామ‌న్నారు. 1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారని చెప్పారు. 1.70 కోట్ల మందికి ధృవపత్రాలు జారీ చేశామ‌న్నారు. 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source