Logo
Download our app
అప్పులు కాదు ఏపీకి రాజ‌ధాని కావాలి
NEWS   Jun 21,2025 08:54 am
ఏపీకి అప్పులు ఇవ్వ‌డం కాద‌ని ముందు రాజ‌ధాని కావాల‌ని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రెడ్డి. ఏ ముఖం పెట్టుకుని విశాఖ‌కు వ‌చ్చారంటూ ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ లేదన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఘ‌న‌త కేంద్రానికి ద‌క్కుతుంద‌న్నారు. ఇంత మోసం చేస్తున్నా ఎందుక‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని నిర్వీర్యం చేయ‌డం త‌ప్పితే చేసింది ఏముందంటూ నిల‌దీశారు.
⚠️ You are not allowed to copy content or view source