Logo
Download our app
జ‌గ‌న్ ను చంపేందుకు కుట్ర - ర‌జిని
NEWS   Jun 21,2025 06:46 am
మాజీ మంత్రి విడద‌ల ర‌జిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ చీఫ్ జ‌గ‌న్ రెడ్డిని చంపేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. దేశంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నార‌ని, ఆయ‌న‌ను భూ స్థాపితం చేయాల‌ని కొంద‌రు ప్లాన్ చేస్తున్నారంటూ వాపోయారు. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు త‌న‌ను అభిమానిస్తున్నార‌ని, రాబోయే రోజుల్లో కూట‌మి పాల‌న‌కు చెర‌మ‌గీతం పాడ‌క త‌ప్ప‌ద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source