Logo
Download our app
ఎయిర్ ఇండియాలో ఏం జ‌రుగుతోంది..?
NEWS   Jun 20,2025 12:25 pm
టాటా గ్రూప్ స్వంతం చేసుకున్న ఎయిర్ ఇండియాలో ఏం జ‌రుగుతోందంటూ సర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌రుస‌గా విమానాలలో సాంకేతిక వైఫ‌ల్యాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప‌లు విమానాల‌ను ర‌ద్దు చేస్తున్నారు. దుబాయ్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి మెల్ బోర్న్, మెల్ బోర్న్ నుంచి ఢిల్లీ, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలు సహా మరికొన్ని రద్దు చేసింది. సాంకేతిక సమస్యలతో మొత్తం 8 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తరచూ ఫ్లైట్స్ లో టెక్నిక‌ల్ ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source