Logo
Download our app
ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది
NEWS   Jun 20,2025 06:36 am
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో నవశకం ఆరంభమవుతున్న తరుణంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.
⚠️ You are not allowed to copy content or view source