Logo
Download our app
ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ మార్పులు
NEWS   Jun 20,2025 08:10 am
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా, అంతర్జాతీయ సర్వీసుల విషయంలో కీలక ప్రకటన చేసింది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. అలాగే మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు గురువారం వెల్లడించింది. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సంస్థ పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source