Logo
Download our app
ఇరాన్‌పై సైనిక చర్య.. రెండు వారాల్లో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం
NEWS   Jun 20,2025 07:48 am
ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ గురువారం వెల్లడించింది. ఇరాన్‌పై దాడి చేసే ప్రణాళికలకు ట్రంప్ సూత్రప్రాయంగా మద్దతు తెలిపారని, అయితే తుది ఆదేశాలు ఇంకా జారీ చేయలేదని వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
⚠️ You are not allowed to copy content or view source