Logo
Download our app
ఏపీ నిర్వాకం నిరంజ‌న్ రెడ్డి ఆగ్ర‌హం
NEWS   Jun 19,2025 02:53 pm
మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జ‌రిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించారు. నిస్సిగ్గుగా సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలుప‌డం దారుణ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గోదావ‌రి నుంచి నీళ్ల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించుకు పోయేందుకు బ‌న‌క‌చ‌ర్ల అనే ప్రాజెక్టును ముందుకు తీసుకు వ‌స్తున్నార‌ని ఆరోపించారు. దీని గురించి హ‌రీశ్ రావు బ‌య‌ట పెడితేనే స‌ర్కార్ స్పందించింద‌న్నారు. ఇప్పుడు అంతా త‌న‌కు ఏదో తెలిసిన‌ట్లు నాట‌కాలు ఆడుతున్నాడంటూ సీఎంపై మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source