Logo
Download our app
గ్లోబల్ ర్యాంకుల్లో భారత విద్యాసంస్థల ప్రభంజనం
NEWS   Jun 19,2025 12:18 pm
ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 గురువారం విడుదలయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో రికార్డు స్థాయిలో 54 భారతీయ విద్యాసంస్థలు స్థానం దక్కించుకున్నాయి. దేశంలోని విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ) అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే, ఐఐటీ ఢిల్లీ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది. గతేడాది 150వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 123వ స్థానానికి దూసుకెళ్లింది.
⚠️ You are not allowed to copy content or view source