Logo
Download our app
జ‌గ‌న్ రెడ్డిపై అన‌గాని ఆగ్ర‌హం
NEWS   Jun 18,2025 06:02 pm
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్. త‌న ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రాన్ని రావ‌ణకాష్టంగా మార్చాడ‌ని ఆరోపించారు. ఎవ‌రైనా నేర‌స్తుల‌కు శిక్ష ప‌డేలా చేస్తార‌ని కానీ క్రిమిన‌ల్స్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌ను ప‌క్క‌న పెట్టిన ఘ‌న‌త జ‌గ‌న్ కే ద‌క్కుతుంద‌న్నారు. ల‌ష్క‌రే తోయిబా లాగా ఉగ్ర‌వాదాన్ని పెంచేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు ఇబ్బంది క‌లిగిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source