Logo
Download our app
ఉపరాష్ట్రపతితో నారా లోకేశ్ భేటీ
NEWS   Jun 18,2025 11:32 am
ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన... ఈరోజు, రేపు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా లోకేశ్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్, బైరెడ్డి శబరి ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source