జూలై నుంచి నవోదయ విద్యాలయాలు స్టార్ట్
NEWS Jun 17,2025 09:56 am
తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజ్ గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేటలలో వీటిని ఏర్పాటు చేశారు. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని విద్యా శాఖ వెల్లడించింది.