Logo
Download our app
ఢిల్లీ ఎస్వీ కాలేజీ ప్ర‌తిష్ట పెరిగేలా చూడాలి
NEWS   Jun 17,2025 08:26 am
టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిథి గృహంలో ఈవో జె. శ్యామలరావు, గవర్నంగ్ బాడీ సభ్యులతో 155వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్వీ కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా బీఆర్ నాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గవర్నింగ్ బాడీ ఛైర్మెన్ గా ఎంపికైన నాయుడును స‌భ్యులు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source