నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ భాష
NEWS Jun 16,2025 05:26 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ భాషను ఆప్షనల్ గా చేర్చాలని ఆదేశించారు. జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలన్నారు. ప్రతీ నెలా మూడో వారంలో విద్య, వైద్యంపై సమీక్ష నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.