Logo
Download our app
5 ల‌క్ష‌ల మందితో యోగా ర్యాలీ - స‌విత
NEWS   Jun 16,2025 12:30 pm
ఈనెల 21న యోగా డే సంద‌ర్బంగా విశాఖ‌పట్నంలో 5 ల‌క్ష‌ల మందితో భారీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నామ‌ని వెల్ల‌డించారు మంత్రి ఎస్. స‌విత‌. పెనుకొండ కియా వ‌ద్ద యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. యోగా ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాల‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే సంద‌ర్బంగా 2 కోట్ల మంది రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని తెలిపారు. వైజాగ్ లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌ని , ప్ర‌తి ఒక్క‌రు పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source