Logo
Download our app
ప్రైవేట్ రుణ‌ సంస్థ‌ల‌కు స్టాలిన్ షాక్
NEWS   Jun 16,2025 10:43 am
రాష్ట్రంలో బ‌ల‌వంతంగా అప్పులు వ‌సూలు చేసే రుణ సంస్థ‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు సీఎం ఎంకే స్టాలిన్. రుణ గ్ర‌హీత‌ల‌ను ఇబ్బంది పెడితే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా బిల్లును శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ర‌వి ఆమోదం తెలిపారు. ప్రజల వద్ద కొన్ని రుణ సంస్థలు బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్నాయని, రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు సీఎం. అందుకే బిల్లు తీసుకు వ‌చ్చామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source