Logo
Download our app
పరస్పరం రాజీతోనే సత్వర న్యాయం
NEWS   Jun 14,2025 02:37 pm
కక్షిదారులు పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో జాప్యాన్ని నివారించడానికి ఇరు పార్టీలు రాజీ పడటం ఉత్తమం అని అన్నారు. ప్రస్తుత లోక్ అదాలత్ లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడంలో కృషి చేసిన న్యాయవాదులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source