విమాన ప్రమాదం అత్యంత బాధాకరం
NEWS Jun 13,2025 11:20 am
ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన తనను కలిచి వేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన హుటా హుటిన ప్రమాద స్థలాన్ని సందర్శించారు. నేరుగా ఎయిర్ పోర్టు నుంచి మేఘా నగర్ కు చేరుకున్నారు. ఆయన వెంట సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు వివరించారు కేంద్ర మంత్రి. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు పీఎం.