ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ - పీఎం
NEWS Jun 13,2025 08:21 am
ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి బెంజిమన్ నెతనాహ్యూ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ఇరాన్ పై వైమానిక దాడులు చేపట్టామని వెల్లడించారు. ప్రధానంగా అణు స్థావరాలపై దాడులకు దిగామన్నారు. మిస్సైళ్లతో విరుచుకు పడినట్లు తెలిపారు. పీఎం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజధాని టెహ్రాన్‌లో ఉన్న పలు అణు స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' ప్రారంభించామని ప్రకటించారు నెతనాహ్యూ.