Logo
Download our app
అర చేతిలో వైకుంఠం బాబు మాయాజాలం
NEWS   Jun 13,2025 07:39 am
రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌లు అస్త‌వ్య‌స్తంగా మారాయంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. దాదాపు 2.70 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. వీటిని ఎప్పుడూ భర్తీ చేస్తారో తెలియడం లేద‌న్నారు. ఏడాదిలో బాబు సాధించిన ప్రగతి రూ.17 వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారం త‌ప్పా ఒరిగింది ఏమీ లేద‌న్నారు. సర్దుబాటు పేరుతో రెండు సార్లు భారం మోపారంటూ మండిప‌డ్డారు. ఇదే ఆయ‌న సాధించిన ఘ‌న‌త అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సాధించిన ప్రగతి అప్పులు తీసుకోవడం త‌ప్ప ఏం చేశారంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source