Logo
Download our app
విమాన బాధిత కుటుంబాల‌కు రూ. కోటి ప‌రిహారం
NEWS   Jun 12,2025 07:58 pm
ఎయిర్ ఇండియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ కంప‌నీకి చెందిన విమానం గురువారం మ‌ధ్యాహ్నం అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బ‌యలుదేరిన కొద్ది సేప‌టికే మేఘ‌నా న‌గ‌ర్ పై కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో 242 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు మెడిక‌ల్ కాలేజీ క్వార్ట‌ర్స్ భ‌వ‌నంలో ఉంటున్న 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టాటా గ్రూప్ బాధితుల‌కు రూ. ఒక కోటి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. కంపెనీ అన్ని వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తుంద‌న్నారు. బీజె మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌నం పున‌ర్ నిర్మాణానికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source