Logo
Download our app
టీటీడీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి
NEWS   Jun 11,2025 01:58 pm
శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపులోను, ఇతర అలవెన్స్ ల చెల్లింపులోను అలసత్వం లేకుండా పరిష్కరించాలని కోరారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ, వినాయకనగర్, రామనగర్ ప్రాంతాలలోని టిటిడి క్వార్టర్స్ లలో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source