Logo
Download our app
ఎనిమిది గంట‌ల పాటు ప్ర‌భాక‌ర్ రావు విచారణ
NEWS   Jun 09,2025 09:18 pm
గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు సోమ‌వారం సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌ను ఎనిమిది గంట‌ల పాటు విచారించారు. త‌దుప‌రి విచార‌ణ కోసం జూన్ 11న తిరిగి రావాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన రోజే త‌ను రాజీనామా చేశారు. ఆ వెంట‌నే అమెరికాకు వెళ్లి పోయారు. అనారోగ్యం పేరుతో అక్క‌డే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించ‌డంతో నిన్న హైద‌రాబాద్ కు వ‌చ్చారు.
⚠️ You are not allowed to copy content or view source