Logo
Download our app
కొమ్మినేని అరెస్ట్ అప్ర‌జాస్వామికం
NEWS   Jun 09,2025 04:08 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాక్షి యాంక‌ర్ , జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస రావును తాళ్లూరు పోలీసులు అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చి పోతున్నారంటూ మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఏడాది గ‌డిచి పోయింద‌ని, నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source